: మాకు ముందు చూపుంది... చంద్రబాబులా దొంగ చూపు లేదు: కేసీఆర్


ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. అవశేషాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. కరెంటు విషయంలో చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలే అని చెప్పారు. తమకు ముందు చూపు లేదని ఆరోపిస్తున్నారని... తమకు ముందుచూపు ఉందని, చంద్రబాబులా దొంగచూపు లేదని అన్నారు. కరెంట్ విషయంపై సుప్రీంకోర్టుకు వెళతామని... సంగతేందో చూస్తామని చెప్పారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్తులో కోత విధిస్తున్నారని అన్నారు. కృష్ణపట్నం ప్లాంట్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయమని చంద్రబాబు అంటున్నారని... అదేమైనా ఆయన బాబు జాగీరా? అంటూ మండిపడ్డారు. అది రెండు రాష్ట్రాల జాయింట్ వెంచర్ అని చెప్పారు.

  • Loading...

More Telugu News