: రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన శ్రీ చైతన్య విద్యాసంస్థలు


హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం శ్రీ చైతన్య విద్యాసంస్థలు రూ. 2 కోట్ల విరాళం ఇచ్చాయి. హైదరాబాదులోని ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలసిన శ్రీ చైతన్య డైరెక్టర్లు శ్రీధర్, సుష్మ, సీమ ఈ మేరకు చెక్కును అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర అతలాకుతలం అయిందని, బాధితులను ఆదుకోవడానికి తమ వంతు సాయంగా ఈ మొత్తాన్ని ఇచ్చామని తెలిపారు.

  • Loading...

More Telugu News