: నిబంధనలు ఉల్లంఘించిన 'ఐసీఐసీఐ లాంబార్డ్'కు జరిమానా
ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్ సంస్థకు ఐఆర్ డీఏ రూ. 50 లక్షల జరిమానా విధించింది. 2011, 2012, 2013, 2014 ఆర్థిక సంవత్సరాల్లో ఈ సంస్థ పలు నిబంధనలను ఉల్లంఘించిందని ఐఆర్ డీఏ తెలిపింది. ఉత్తర్వులు జారీ అయిన 15 రోజుల్లోగా జరిమానా మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. తప్పుడు ఎంట్రీలు వేయడం, ఫైళ్ల నిబంధనలు ఉల్లంఘించడం, ఒకే పాలసీకి వేర్వేరు పత్రాలు చూపించడం లాంటి కార్యకలాపాలకు లాండార్డ్ పాల్పడిందని ఐఆర్ డీఏ వెల్లడించింది. అలాగే, క్లెయిముల పరిష్కారం విషయంలో కూడా ఆలస్యం చేస్తోందని తెలిపింది.