: రేపు టీఆర్ఎస్ లో చేరనున్న మరో వైకాపా నేత


తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, వైకాపా వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోమేశ్వర్ రావు జంప్ జిలానీల లిస్టులోకి చేరారు. రేపు ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో, వైకాపా జిల్లా అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధినేత జగన్ కు పంపించారు. సోమేశ్వర్ రావు రాజీనామాతో వరంగల్ జిల్లాలో... వైకాపాకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News