: తమిళ నటుడు ఎస్.ఎస్.రాజేంద్రన్ కన్నుమూత
ప్రముఖ తమిళ నటుడు ఎస్.ఎస్.రాజేంద్రన్ (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. నట దిగ్గజాలైన ఎంజీఆర్, శివాజీ గణేశన్ లకు ఆయన సమకాలికులు. ఎస్.ఎస్.ఆర్ గా ఆయన సుప్రసిద్ధులు. డీఎంకే తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎస్.ఎస్.ఆర్... ఆ తర్వాత ఎంజీఆర్ స్థాపించిన అన్నా డీఎంకేలో చేరారు. కొంతకాలం తర్వాత రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికారు. ఎస్.ఎస్.ఆర్ మృతి పట్ల పలువురు తమిళ, తెలుగు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.