: తెలంగాణలో కరెంట్ లేకపోయినా... తాగడానికి మందు మాత్రం ఫుల్ గా ఉంది: సీతక్క


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. తెలంగాణలో కల్లు కాంపౌండ్లు వెల్లివిరిసేలా కేసీఆర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు కల్లు కాంపౌండ్ల మీద ఉన్న శ్రద్ధ... రైతులకు విద్యుత్ అందించాలనే దానిపై లేదని ఆమె ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు విద్యుత్ లేకున్నా... మద్యం మాత్రం ఫుల్ గా దొరుకుతోందని ఎద్దేవా చేశారు. ఒకవైపు చంద్రబాబును, మరోవైపు మోదీని నిలదీయమన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని... ఆమాత్రం దానికి ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకని నిలదీశారు.

  • Loading...

More Telugu News