: భూమా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే పోటీ నుంచి తప్పుకున్నాం


ఆళ్లగడ్డ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్టు ఇండిపెండెంట్ అభ్యర్థులు సింగం వెంకటేశ్వరరెడ్డి, బాలగంగాధర్ రెడ్డి ప్రకటించారు. ఈ రోజుతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో, వీరిరువురూ తప్పుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, భూమా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే తాము పోటీ నుంచి తప్పుకున్నామని తెలిపారు. ప్రధాన పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్ లు కూడా పోటీ నుంచి తప్పుకున్నాయి. దీంతో, వైకాపా అభ్యర్థి, భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

  • Loading...

More Telugu News