: నల్లకుబేరుల జాబితా వెల్లడిపై మేం భయపడట్లేదు: చిదంబరం


స్విస్ బ్యాంకుల్లో అక్రమ సంపాదనను దాచుకున్న వ్యక్తుల జాబితా విడుదలపై తామేమీ భయపడటం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. సదరు జాబితాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కేంద్ర మాజీ మంత్రి ఉన్నారన్న దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లీకులు జారీ చేసిన సందర్భంగా చిదంబరం స్పందించారు. ‘జాబితాలో పేర్లున్న వ్యక్తులు భయపడతారు తప్పించి, పార్టీ ఎందుకు కలవరపడుతుంది? ఈ తరహా అక్రమాలు వ్యక్తిగతమైనవి’ అని చిదంబరం వ్యాఖ్యానించారు. ‘నల్ల కుబేరుల వెల్లడిలో బీజేపీ ప్రభుత్వం మా మాదిరే వ్యవహరిస్తోంది. న్యాయపరంగా సర్కారు నిర్ణయం సరైనదే. అయితే మాపైనే తిరిగి నిందలేస్తూ తప్పు చేస్తోంది’ అని చిదంబరం అన్నారు.

  • Loading...

More Telugu News