: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు శుభసూచకం: ఆప్ నేతలు
దీపావళి పర్వదినాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, సైనికుల మధ్య జరుపుకోవడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ స్వాగతించింది. శత్రుదేశాల నుంచి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులతో మోదీ కలిసిపోయి, దీపావళి సంబరాలు జరుపుకున్న తీరు సత్సంప్రదాయానికి తెర తీసిందని ఆ పార్టీ నేతలు కుమార్ విశ్వాస్, యోగేంద్ర యాదవ్ లు అన్నారు. మోదీ చర్యను అందరూ స్వాగతించాల్సిందేనని కూడా వారు వ్యాఖ్యానించారు.