: ఈ బ్యాటరీతో రెండు నిమిషాల్లో సెల్ చార్జింగ్ ఫుల్!


సింగపూర్ కు చెందిన నాన్యాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన హైబ్రిడ్ బ్యాటరీ అందుబాటులోకి వస్తే, ఎలాంటి సెల్ ఫోన్ నైనా కేవలం రెండంటే రెండు నిమిషాల్లోనే చార్జ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులను నిత్యం వేధిస్తున్న చార్జింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు సదరు వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు ఫలించాయి. అయితే, ఈ సూపర్ బ్యాటరీ మార్కెట్ లోకి రావడానికి ఇంకా రెండేళ్ల సమయం పడుతుందట. అతి తక్కువ సమయంలోనే సెల్ ఫోన్ ను పూర్తి స్థాయిలో చార్జింగ్ చేసేందుకు బ్యాటరీలో గ్రాఫైట్ కు బదులు టైటానియం డయాక్సైడ్ ను వాడినట్లు సదరు శాస్త్రవేత్తలు చెప్పారు.

  • Loading...

More Telugu News