: గూగుల్ డూడిల్ గా 'మామ్'
భారత్ ప్రతిష్ఠాత్మక రీతిలో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) అంగారకుడిపై నెలరోజులు పూర్తి చేసుకుంది. దీన్ని పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేక డూడిల్ తో 'మామ్' డూడిల్ కు నీరాజనాలర్పించింది. ఈ డూడిల్ లో మామ్ ఆర్బిటర్ పై 'గూగుల్' అన్న అక్షరాలు దర్శనమిస్తాయి. గూగుల్ ఆయా చారిత్రక ఘట్టాలను, సుప్రసిద్ధ వ్యక్తులను డూడిల్ రూపంలో ప్రదర్శిస్తుండడం తెలిసిందే.