: ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్ లో సైనా, కశ్యప్
భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ లో దూసుకెళుతున్నారు. మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకోగా, పురుషుల సింగిల్స్ లో పారుపల్లి కశ్యప్ కూడా క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాడు. సిరీస్ ప్రారంభం నుంచే సంచలన ఆటతీరుతో ముందుకెళుతున్న కశ్యప్, గురువారం రాత్రి జరిగిన పోటీలో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తియాన్ హౌవీని 21-19, 21-18తో వరుస గేముల్లో మట్టి కరిపించి క్వార్టర్స్ కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్, స్కాట్లాండ్ కు చెందిన కిర్ స్టీ గిల్మోర్ ను ఓడించి క్వార్టర్స్ లోకి ప్రవేశించింది.