: మళ్ళీ దీక్షకు దిగిన జూడాలు... పోలీసులతో వాగ్వివాదం
హైదరాబాదులో జూనియర్ డాక్టర్లు మళ్ళీ దీక్షకు దిగారు. ఉస్మానియా కళాశాల వద్ద దీక్షకు దిగిన జూడాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, జూడాలకు మధ్య వాగ్వివాదం జరిగింది. అయితే, దీక్షను వీడేది లేదన్న జూడాలు అక్కడే మెట్లపై బైఠాయించారు. తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిపాటు సేవలందించాలన్న నిబంధనను జూనియర్ డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.