: రష్యన్ మహిళపై గోవాలో రెండుసార్లు అత్యాచారం


హాలీడే ట్రిప్ కోసం గోవాకు వచ్చిన రష్యన్ మహిళపై రెండుసార్లు అత్యాచారం జరిగింది. తొలిసారి 'బాగా' బీచ్ లో ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేయగా, వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యుడొకరు ఆమెపై అత్యాచారం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని గోవా వైద్య, ఆరోగ్య శాఖ గోవా మెడికల్ కాలేజి హాస్పిటల్ (జీఎంసీహెచ్)ను ఆదేశించింది. ఈ నెల 16న గోవాకు చేరుకున్న బాధితురాలు 20వ తేదీ అర్ధరాత్రి 'బాగా' బీచ్ లో అత్యాచారానికి గురైంది. బాధితురాలి నుంచి విలువైన వస్తువులను దోచుకున్న ఆగంతుకుడు ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలిని పోలీసులు జీఎంసీహెచ్ కు వైద్య పరీక్షల నిమిత్తం పంపారు. ఆస్పత్రిలో తొలుత ఓ మహిళా వైద్యురాలు బాధితురాలికి పరీక్షలు నిర్వహించారు. అనంతరం మరోమారు పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన సీనియర్ వైద్యుడు తనపై అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తునకు గోవా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, గోవాలోని రష్యా రాయబార కార్యలయంలో లీగల్ అడ్వైజర్ గా పనిచేస్తున్న వర్మ చెప్పారు.

  • Loading...

More Telugu News