: ఆ కార్యక్రమాలు విజయోత్సవ సభల్లా ఉన్నాయి: సీపీఎం నేత మధు
హుదూద్ తుపాను సహాయక కార్యక్రమాలను చంద్రబాబు ప్రభుత్వం విజయోత్సవ సభల్లా నిర్వహిస్తోందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు ఆరోపించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించిన సందర్భంగా మధు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే, రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయంలో దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే చంద్రబాబు ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.