: స్కూల్ ఆఫ్ జిహాద్... పసిపిల్లలకు ‘ఉగ్ర’ శిక్షణ ఇస్తోంది!


సిరియా, ఇరాక్ లలో భయానక దాడులకు తెగబడుతున్న 'ఇసిస్' ఉగ్రవాదులు, తాజాగా ముక్కుపచ్చలారని చిన్నారులను కూడా ఉగ్రవాదంవైపు మళ్లించేందుకు స్కూల్ ఆఫ్ జిహాద్ పేరిట ఏకంగా పాఠశాలనే తెరిచారట. ఆ సంస్థ అధికారిక మీడియా విభాగాలుగా పరిగణిస్తున్న మౌసిస్సాత్ అల్ ఫర్కాన్, ఆల్- ఇ తిసామ్ మీడియాలు విడుదల చేసిన వీడియోలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. తమ వ్యతిరేకులను అత్యంత దారుణంగా తలలు తీసి హతమారుస్తున్న సందర్భంగా రికార్డు చేసిన వీడియోలను స్కూల్ ఆఫ్ జిహాద్ లో పదేళ్ల లోపు పిల్లకు చూపిస్తున్నారు. అంతేగాక, అంత చిన్న వయసులోనే వారికి ఏకే-47 తరహా ఆయుధాలను వినియోగించే తీరును కూడా నేర్పిస్తున్నారట. సదరు శిక్షణను పూర్తి చేసుకున్న పిల్లలకు గ్రాడ్యుయేషన్ పేరిట డిగ్రీలను కూడా ఇసిస్ ఉగ్రవాదులు అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News