: హెలికాప్టర్ ను ఢీకొన్న ఛార్టర్డ్ ఫ్లైట్... ముగ్గురు దుర్మరణం
అమెరికాలోని మేరీలాండ్ ఎయిర్ పోర్టులో ప్రమాదం సంభవించింది. హెలికాప్టర్ ను ఓ ఛార్టర్డ్ విమానం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. హెలికాప్టర్, విమానం గాలిలోనే ఢీకొన్నాయి. విమానం ఫ్రెడరిక్ మున్సిపల్ ఎయిర్ పోర్టుకు వెళుతుండగా, హెలికాప్టర్ శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా విన్యాసాలు చేస్తోంది.