: ఈ ఉల్లి... ప్రపంచంలోనే అతి పెద్దదట!


పెద్ద ఉల్లిగడ్డ ఎంత బరువుంటుంది? మహా అయితే వందో, రెండొందల గ్రాములో, ఇంకా ఎక్కువ అంటే.. పావు కిలో ఉంటుందేమో. మరి ఒకే ఉల్లిగడ్డ ఎనిమిది కిలోలు తూగితే, దానిని అతి పెద్ద ఉల్లిగా ఒప్పేసుకోవాల్సిందే. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారే ఒప్పుకున్నారు. మనం కూడా ఒప్పుకోకతప్పదు! అసలు విషయానికొస్తే, ఇంగ్లండ్ లోని సౌత్ డెర్బీషైర్ కు చెందిన మోయిరా నగరవాసి టోనీ గ్లోవర్, పెద్ద ఉల్లిగడ్డల సాగును తన తండ్రి నుంచి వారసత్వంగా అందుకుని ఏళ్లుగా కొనసాగిస్తున్నాడు. ఇంతకుముందు 5 కిలోల బరువుండే ఉల్లిగడ్డను పెంచిన గ్లోవర్, తాజాగా, ఏకంగా ఎనిమిది కిలోల బరువుండే ఉల్లిగడ్డను తన పెరడులో పెంచాడు. ఈ అతిపెద్ద ఉల్లి వ్యాసార్థం 32 అంగుళాల మేర ఉందట. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లిగా గిన్నిస్ బుక్ పరిగణించింది.

  • Loading...

More Telugu News