: న్యూయార్క్ లో తొలి ఎబోలా కేసు
న్యూయార్క్ లో తొలి ఎబోలా కేసు నమోదైంది. న్యూయార్క్ లో ఓ డాక్టర్ కు ఎబొలా మహమ్మారి సోకినట్టు పరీక్షల్లో తేలింది. ఆయన ఇటీవల ఎబొలా వ్యాధిగ్రస్తులకు చికిత్స నిమిత్తం జెనీవా వెళ్ళివచ్చారు. ఈ సందర్భంగానే ఆయనకు వ్యాధి సోకి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తమ్మీద ఇది అమెరికాలో నాలుగో కేసు. ఈ నేపథ్యంలో అమెరికా ఎయిర్ పోర్టుల్లో మెడికల్ స్క్రీనింగ్ కఠినతరం చేశారు.