: ఫ్రెంచ్ ఓపెన్ ప్రదర్శనతో సైనా, కశ్యప్ ల ర్యాంకులు మెరుగు!
ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ లో మెరుగైన ప్రదర్శనను నమోదు చేసిన భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు తమ అంతర్జాతీయ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో సైనా ఓ మెట్టు అధిగమించి ఆరో ర్యాంకును కైవసం చేసుకుంది. ఇక, ర్యాంకింగ్స్ లో తనకన్నా మెరుగైన స్థాయిలో ఉన్న జపాన్ ఆటగాడిని మట్టి కరిపించిన పారుపల్లి కశ్యప్ ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంకుకు చేరుకున్నాడు. మరో షట్లర్ శ్రీకాంత్ కూడా ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని 21వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక, తెలుగుతేజం పీవీ సింధు పదో ర్యాంకులోనే కొనసాగుతోంది.