: విశాఖ ఆర్కే బీచ్ లో వెంకయ్య 'స్వచ్ఛ భారత్'
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విశాఖపట్నం ఆర్కే బీచ్ లో నిర్వహించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి భారతీయుడు 'స్వచ్ఛ భారత్'లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 2019 నాటికి పరిశుభ్ర భారత్ కోసం అందరూ పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యతో పాటు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు కూడా పాల్గొన్నారు.