: మోదీ జమ్మూకాశ్మీర్ పర్యటన సక్సెస్!
దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకాశ్మీర్ లో గురువారం జరిపిన పర్యటన విజయవంతమైంది. దీపావళిని పురస్కరించుకుని జమ్మూకాశ్మీర్ వరద బాధితుల మధ్య గడిపేందుకు వెళుతున్నానని ప్రకటించిన మోదీ, తన పర్యటనపై దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించారు. తన పర్యటనలో భాగంగా గురువారం ఉదయం సియాచిన్ గ్లేసియర్ చేరుకున్న ప్రధాని, అక్కడి సైనికులతో సరదాగా గడిపారు. అనంతరం శ్రీనగర్ వచ్చిన ఆయన వరదల కారణంగా దెబ్బతిన్న పలు ప్రాంతాలను సందర్శించారు. వరద నష్టాల నుంచి జమ్మూకాశ్మీర్ ను బయటపడేసేందుకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఈ సందర్భంగా మోదీకి పలువురు రాజకీయ ప్రముఖులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రధాని గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.