: హైదరాబాదు శివార్లలో రేవ్ పార్టీ భగ్నం
ఇటీవల హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా, రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ప్రాంతంలోని మురారిపల్లిలో ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. హనీబర్గ్ రిసార్ట్స్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేశారు. దీంతో, పది మంది దాకా యువతీయువకులు పారిపోయేందుకు యత్నించగా, వారిని అదుపులోకి తీసుకున్నారు.