: ఉగ్రవాదులపై పోరు రెట్టింపు చేస్తాం: కెనడా ప్రధాని


ఒట్టావాలో పార్లమెంటు ఎదుట ఓ దుండగుడు కాల్పులు జరపగా, ఓ సైనికుడు మృతి చెందడంతో కెనడా ఉలిక్కిపడింది. ఇలాంటి చర్యలతో తమను బెదిరించలేరని కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ స్పష్టం చేశారు. ఇకమీదట ఉగ్రవాదంపై తమ పోరును రెట్టింపు చేస్తామని అన్నారు. కెనడా ప్రజల రక్షణ కోసం భద్రత సంస్థలు అన్ని చర్యలు తీసుకుంటాయని తెలిపారు. పార్లమెంటు వద్ద కాల్పుల ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News