: ఒబామా దీపావళి సందేశం
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సందేశం అందించారు. కటికచీకట్లోనూ దీపం వెలుగుతూనే ఉంటుందని అన్నారు. భవిష్యత్తు వెలిగిపోవాలంటే ప్రతి ఒక్కరూ సాటి వ్యక్తులకు సాయపడాలని పిలుపునిచ్చారు. ముంబైలో తన భార్య మిషెల్, ఇతర మిత్రులతో దీపావళి జరుపుకున్న క్షణాలు మధురమైనవని ఒబామా గుర్తు చేసుకున్నారు. కాగా, వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు నిర్వహించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామానే కావడం విశేషం. 2009లో భారత సంతతి పౌరులతో కలిసి వైట్ హౌస్ లో దీపావళి ఘనంగా జరుపుకున్నారు.