: హీరో విజయ్ కటౌట్ కు పాలాభిషేకం చేస్తూ అభిమాని దుర్మరణం


తమిళనాడులో 'కత్తి' సినిమా విడుదల రోజే ఓ అభిమాని దుర్మరణం పాలయ్యాడు. వాడకెంచరిలో ఉన్నికృష్ణన్ (25) అనే యువకుడు స్థానిక థియేటర్ వద్ద 'కత్తి' సినిమా హీరో విజయ్ కటౌట్ కు పాలాభిషేకం చేస్తూ పైనుంచి కిందపడిపోయాడు. తీవ్రగాయాలవడంతో ప్రాణాలు విడిచాడు. దీంతో, అక్కడ విషాదం నెలకొంది. వెల్డర్ గా పనిచేసే ఉన్నికృష్ణన్ విజయ్ కి వీరాభిమాని అని స్థానికులు చెప్పారు. విజయ్ అభిమాన సంఘం కార్యకలాపాల్లో ఈ యువకుడు ఎంతో చురుగ్గా పాల్గొనేవాడని వారు తెలిపారు. కాగా, ఏఆర్ మురుగదాస్ డైరక్షన్ లో తెరకెక్కిన 'కత్తి' సినిమా తీవ్ర అవాంతరాల నడుమ నేడు విడుదలకు నోచుకుంది. తమిళనాట పలు సంఘాలు ఈ సినిమాపై అభ్యంతరం చెప్పాయి. విడుదలకు తాము అంగీకరించబోమని హెచ్చరించాయి. ఈ సినిమా నిర్మాతకు శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సకు సంబంధాలున్నాయంటూ తమిళ సంఘాలు ఎలుగెత్తాయి. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పేరు తొలగించాల్సిందేనని డిమాండ్ చేశాయి. చివరికి సంస్థ పేరు తొలగించి రిలీజ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News