: శ్రీశైలం వివాదాన్ని కృష్ణానదీ బోర్డు చూసుకుంటుంది: గవర్నర్
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి వివాదంపై కృష్ణానదీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. ఈ విషయంపై టీఎస్ మంత్రి హరీష్ రావుతో మాట్లాడానని తెలిపారు. నీటి సమస్యను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. సమస్యలను పెద్దవి చేసి చూసుకోరాదని సూచించారు. ఈ విషయంపై రెండు రాష్ట్రాల మంత్రులు చర్చలు జరుపుకోవాలన్నారు. విద్యుత్ కేటాయింపులపై సమస్యలు వస్తే కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు. నీటి సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తాను ఇప్పటికే మాట్లాడానని చెప్పారు.