: తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు గులాబీ కోటింగ్


తెలంగాణలో ఆర్టీసీ బస్సులు త్వరలో కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి. రాష్ట్రంలో త్వరలోనే బస్సుల రంగును మార్చనున్నట్టు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించారు. అలాగే, తెలంగాణ ఆర్టీసీకి కొత్త లోగో సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు కూడా బస్సులు నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. సుమారు 500 రూట్లలో ప్రైవేట్ వాహనాలు అక్రమంగా తిరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు గులాబీ కోటింగ్ వేయనున్నారు. అలాగే, 'పల్లెవెల్లుగు' బస్సులను 'గ్రామరథం'గా మార్చనున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News