: హైదరాబాద్ లో ఇద్దరు సిమి కార్యకర్తలు అరెస్ట్
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం ఇద్దరు సిమి కార్యకర్తలు అరెస్టయ్యారు. నార్త్ జోన్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారిని మహారాష్ట్రకు చెందిన షాముదాఫిర్, షోయబ్ లుగా పోలీసులు గుర్తించారు. సిమి మాజీ సభ్యుడిని కలిసి ఆల్ కాయిదాలో చేరేందుకే వారు నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు వచ్చిన వారు పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ లకు చెందిన ఉగ్రవాదులతో చాటింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.