: 30 లక్షల కుటుంబాలపై హుదూద్ ప్రభావం
ఉత్తరాంధ్రలో విలయ తాండవం చేసిన హుదూద్ తుపాను దాదాపు 30 లక్షల కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ నివేదిక రూపొందించింది. ఈ కుటుంబాలన్నీ విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందినవేనని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఆ నివేదికలో తెలిపింది. తుపాను కారణంగా 11,58,132 కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని వివరించింది. ఆ కారణంగా 46 మంది ప్రజలు చనిపోగా, 43 మంది గాయపడ్డారని ఆ నివేదిక తెలిపింది. తుపాను సృష్టించిన విలయం కారణంగా జరిగిన నష్టం రూ.60 వేల కోట్లకు పైగానే ఉంటుందని ఆ నివేదిక అంచనా వేసింది.