: కాగడాల వెలుగులో ఆర్కే బీచ్!
విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ బుధవారం సాయంత్రం కాగడాల వెలుగులతో నిండిపోయింది. తుపాను బాధితుల్లో ధైర్యం నింపేందుకు ఏపీ సర్కారు చేపట్టిన ఆత్మ విశ్వాస ర్యాలీలో భాగంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు, కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడు సహా రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువత రెట్టించిన ఉత్సాహంతో ఈ ర్యాలీలో కాగడాలు చేతబట్టి ముందుకు కదులుతోంది. స్వయంగా చంద్రబాబు, మంత్రులు కాగడాలు చేతబట్టారు. ర్యాలీ నేపథ్యంలో ఆర్కే బీచ్ జనసంద్రాన్ని తలపిస్తోంది.