: పెదాలపై చిరునవ్వు, కడుపులో విషం... ఇదే చంద్రబాబు నైజం: హరీశ్ రావు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెదాలపై నవ్వు, కడుపులో విషం... ఇదే చంద్రబాబు నైజమని ఆరోపించారు. వెన్నుపోట్లు, మోసం తదితర అంశాల్లో బాబుకు డాక్టరేట్ ఉందని వ్యంగ్యం ప్రదర్శించారు. విద్యుత్ విషయంలో గవర్నర్ వద్దకు వెళ్ళిన కాంగ్రెస్ నేతలను విమర్శించేందుకు టీడీపీ నేతలకు మాటలు రావడం లేదని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే హక్కు తెలంగాణ రాష్ట్రానికే ఉందని హరీశ్ రావు ఉద్ఘాటించారు. కృష్ణా రివర్ బోర్డు సందేహాలకు తాము జవాబిచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కష్టాలకు కారణమైన టీడీపీ, కాంగ్రెస్ నేతలు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News