: త్వరలో కోహ్లీ, అనుష్కల ఎంగేజ్ మెంట్!
టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు త్వరలో ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నారట. మొన్నటిదాకా తమ మధ్య కొనసాగుతున్న ఎఫైర్ పై వారిద్దరూ నోరు విప్పలేదు. ఇటీవలి టీమిండియా విదేశీ పర్యటనలో కోహ్లీ వెంట అనుష్క వచ్చేందుకు అనుమతించి, బీసీసీఐ విమర్శలపాలైంది. అయితే అప్పుడు కూడా వారిద్దరూ దీనిపై పెద్దగా స్పందించలేదు. తాజాగా, వీరిద్దరి కుటుంబాలు ఓ వారం క్రితం కలిశాయట. ఈ సందర్భంగా కోహ్లీ, అనుష్కలకు ముడివేస్తేనే మంచిదని ఇరు కుటుంబాలు ఓ అభిప్రాయానికి వచ్చాయని ముంబై మీడియా పలు కథనాలను ప్రచారం చేస్తోంది. ఈ కథనాలే నిజమైతే, టీమిండియా వైస్ కెప్టెన్ కోహ్లీ ఓ ఇంటివాడవనున్నట్టే లెక్క.