: ఏసీబీ వలలో సొంత శాఖ అధికారి!
ప్రభుత్వ శాఖల్లో అతినీతిని అంతమొందించేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే అదే శాఖకు చెందిన ఓ అధికారి లంచం తీసుకుంటూ సొంత శాఖ నిఘా అధికారులకు పట్టుబడిన వైనం బుధవారం హైదరాబాద్ లో వెలుగు చూసింది. అవినీతి నిరోధక శాఖలో ఏఈగా పనిచేస్తున్న సంతోష్ కుమార్ ఓ వ్యక్తి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. రోడ్లు, భవనాల శాఖలో ఏఈగా పనిచేస్తున్న సంతోష్ కుమార్, ఇటీవలే అవినీతి నిరోధక శాఖకు డిప్యుటేషన్ పై వచ్చారు. మాతృశాఖలో లంచాలకు అలవాటు పడ్డ సంతోష్ కుమార్, ఏసీబీలోనూ తన చేతివాటం చూపేందుకు యత్నించి పట్టుబడ్డారు.