: హుదూద్ తుపాను బాధితులకు తానా రూ.33 లక్షల సాయం


హుదూద్ తుపాను బాధితుల కోసం తానా రూ.33 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించింది. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు ఇటీవల అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో తానా సభ్యులు ఈ మేరకు చెక్కును అందజేశారు. తానా సభ్యుల్లో దాదాపు 300 మంది దాకా తుపాను బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అమెరికాలోని ఆష్బర్న్ నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ధూళిపాళ్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తానా సభ్యులు తమ వితరణను ఆయనకు అందజేశారు.

  • Loading...

More Telugu News