: పార్టీ కార్యాలయం దగ్ధం ఘటనపై డీజీపీకి టి.టీడీపీ ఫిర్యాదు


తెలంగాణ టీడీపీ శాసనసభ్యులు డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు. నల్గొండ జిల్లాలో నిన్న(మంగళవారం) తమ పార్టీ కార్యాలయం దగ్ధం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్టు చేయాలని ఆయన్ను కోరారు. అంతేగాక, నల్గొండ జిల్లాలో ఈరోజు శాంతి యాత్రకు వెళుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేశారని ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు డీజీపీకి వినతిపత్రం అందజేశారు.

  • Loading...

More Telugu News