: అమెరికా న్యాయశాఖ కీలక పదవిలో ప్రవాస భారతీయ మహిళ


అమెరికా న్యాయశాఖలో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది. గతంలో అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో సైబర్ సంబంధింత వ్యవహారాలను పర్యవేక్షించిన ప్రవాస భారతీయురాలు అనితా ఎం సింగ్, తాజాగా ఆ దేశ న్యాయశాఖలోని జాతీయ భద్రతా విభాగం (ఎన్ఎస్ డీ)లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్ కౌన్సిలర్ గా బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్తులో ఆ దేశానికి పలు విభాగాల్లో ఎదురుకానున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్త వ్యూహాల రచనలో అనితా సింగ్ కీలక భూమిక పోషించనున్నారు. 2011లో ఎన్ఎస్ డీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనితా సింగ్, ఏడాదిన్నరగా ఎన్ఎస్ డీకి యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపై పూర్తి స్థాయి చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా వ్యవహరిస్తారు. పెన్సిల్వేనియా వర్సిటీ న్యాయశాఖ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా సాధించిన అనితా సింగ్, సైబర్ ఆధారిత వ్యవహారాల్లో విశేష అనుభవాన్ని సాధించారు. జాతీయ భద్రత విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే దిశలో భాగంగా అనితా సింగ్ నియామకాన్ని చేపట్టినట్లు ఆ శాఖ అసిస్టెంట్ అటార్నీ జనరల్ జాన్ కార్లిన్ చెప్పారు.

  • Loading...

More Telugu News