: టెన్నిస్ ఆటగాడు జకోవిచ్ తండ్రయ్యాడు
సెర్బియా టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్ తండ్రి హోదా పొందాడు. అతడి భార్య జెలెనా రిస్టిక్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అతడే తన ట్విట్టర్ లో వెల్లడించాడు. "మాకు మగబిడ్డ జన్మించాడు. నా అందమైన భార్య జెలెనా పట్ల గర్విస్తున్నా. బాబు పేరు 'స్టెఫాన్'. మాకు ప్రేమ, మద్దతు అందించిన అందరికీ నా కృతజ్ఞతలు" అని తెలిపాడు. 2006 నుంచి సహజీవనం చేస్తున్న జకోవిచ్, జెలెనాలు ఈ ఏడాది జులైలో వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే జెలెనా ప్రెగ్నెంట్.