: విశ్వంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత... ఇటలీ శాస్త్రవేత్తల రికార్డు!


విశ్వంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత సాధించి ఇటలీ శాస్త్రవేత్తలు రికార్డు సృష్టించారు. క్యూబిక్ మీటర్ పరిమాణంలో ఉన్నఓ రాగి పాత్ర ఉష్ణోగ్రతను -273.144 డిగ్రీల సెల్సియస్ కు తగ్గించి వారు ఈ ఘనత సాధించారు. ఉష్ణోగ్రతల్లో ‘సంపూర్ణ శూన్యం’ స్థాయి -273.15 డిగ్రీల సెల్సియస్ కాగా, దానికి అతి సమీపంలోకి సదరు రాగి పాత్రను చల్లబరిచారు. గతంలో ఎవరూ కూడా ఈ ఘనత సాధించలేదు. భవిష్యత్తులో వీరి రికార్డును ఛేదించడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతకు చల్లబరచిన ఈ రాగి పాత్ర, 400 కేజీల బరువు తూగిందట. ఇటలీకి చెందిన నేషనల్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఇన్ స్టిట్యూట్ లోని గ్రాన్ సాస్సో నేషనల్ ల్యాబోరేటరీకి చెందిన కోర్ (క్రయోజెనిక్ అండర్ గ్రౌండ్ అబ్జర్వేటరీ ఫర్ రేట్ ఈవెంట్స్) శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు.

  • Loading...

More Telugu News