: జిల్లా ఎస్పీ అండతోనే దాడి జరిగింది: రేవంత్ రెడ్డి


నల్గొండ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు సపోర్ట్ తోనే టీడీపీ కార్యాలయంపై టీఆర్ఎస్ వర్గీయులు దాడి చేశారని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెద్ద దొర (కేసీఆర్)ను తృప్తి పరిచేందుకు చిన్న దొర అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ఎస్పీ తీరును అసెంబ్లీలో లేవనెత్తుతామని తెలిపారు. దివంగత ఎలిమినేటి మాధవ రెడ్డి చిత్రపటాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు దగ్ధం చేయడం అత్యంత దారుణమని రేవంత్ మండిపడ్డారు. జిల్లాలో ఆదర్శ నాయకుడిగా పేరుతెచ్చుకున్న మాధవరెడ్డిని అవమానించిన టీఆర్ఎస్ కు పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News