: వ్యాపారి గొంతు కోసి డబ్బు అపహరించిన దుండగుడు
వ్యాపారి గొంతు కోసి రూ. 3.50 లక్షల నగదును దోచుకెళ్లాడో దుర్మార్గుడు. ఈ ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్మికానిపల్లి గేటు వద్ద జరిగింది. ఈ సంఘటనలో తీవ్ర రక్తస్రావానికి గురైన వ్యాపారి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. వ్యాపారిపై దాడి చేసి దొంగతనానికి పాల్పడిన వ్యక్తి... గతంలో అతని వద్దే డ్రైవర్ గా పనిచేసేవాడని గుర్తించారు.