: 'నోకియా' పేరు ఇక నుంచి 'మైక్రోసాఫ్ట్ లుమియా'
ప్రముఖ మొబైల్ ఫోన్ 'నోకియా' బ్రాండ్ పేరు మారింది. దీని స్థానంలో 'మైక్రోసాఫ్ట్ లుమియా' పేరును అధికారికంగా మార్చినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. ఈ మేరకు నోకియా ఫ్రాన్స్ ఫేస్ బుక్ పేజ్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా పేజీలలో మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. "ఇతర దేశాలు కూడా మార్చిన బ్రాండ్ పేరును ఉపయోగించేలా త్వరలో చర్యలు తీసుకుంటాం" అని తెలిపింది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఈ పేరుతోనే ఆ సంస్థ బ్రాండ్లు మార్కెట్ లోకి రానున్నాయి. అంటే తొలిసారిగా ఫ్రాన్స్ నుంచే ఈ పేరు విపణిలోకి రానుందన్నమాట. అటు స్మార్ట్ ఫోన్లలో కూడా నోకియా పేరును మైక్రోసాఫ్ట్ తీసివేయనుంది. దాంతో, ఓ ప్రత్యేక కంపెనీగా ఉండనున్న నోకియా... నెట్వర్క్స్, మ్యాపింగ్ సర్వీసెస్, టెక్నాలజీ డెవలప్ మెంట్, లైసెన్స్ విషయాలపై దృష్టి పెట్టనుంది.