: రాజీనామా విరమించుకున్న భారత హాకీ కోచ్


భారత పురుషుల జట్టు హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామా విరమించుకున్నాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) తో సమావేశమై మాట్లాడిన అనంతరం ఆయన తన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గాడు. వేతన ఒప్పందం విషయంలో భారత క్రీడా ప్రాధికార సంస్థతో వివాదం కారణంగా పదవి నుంచి వైదొలగుతున్నట్లు నిన్న(మంగళవారం) వాల్ష్ ప్రకటించాడు. అటు వాల్ష్ సమస్యను పరిష్కరిస్తామని, అతని సేవలు కొనసాగిస్తామని సాయ్ డైరెక్టర్ జనరల్ థామ్సన్ నిన్ననే తెలిపారు.

  • Loading...

More Telugu News