: శ్రీశైలంలో తగ్గుతున్న నీటి మట్టం
శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం అంతకంతకూ తగ్గుతోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం రోజుకు 40 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తోంది. దీంతో, నీటి మట్టం అంతకంతకూ పడిపోతోంది. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 857.5 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 98.6 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.