: ఎన్నికల మేనిఫెస్టో భగవద్గీత వంటిది: కేబినెట్ సహచరులతో మోదీ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండాలంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్నికల మేనిఫెస్టో పవిత్రమైన భగవద్గీత వంటిదని ఆయన తన కేబినెట్ సహచరులకు ఉద్బోధించారు. ఆ మేనిఫెస్టోను ప్రతిరోజూ చదవాలని, తద్వారా తాము ఎంతమేర పనిచేశామన్న విషయం అంచనాకొస్తుందని సలహా ఇచ్చారు. భవిష్యత్ ప్రణాళికల విషయమై ఒకరి ఆలోచనలు మరొకరితో పంచుకోవాలని ప్రధాని సూచించారు. తద్వారా, కేబినెట్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు.