: బీజేపీ అధినాయకత్వాన్ని కలసిన శివసేన నేతలు
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పర్యవేక్షకుడు రాజ్ నాథ్ సింగ్, సీనియర్ నేత జేపీ నద్దాలను శివసేన నేతలు అనిల్, సుభాష్ దేశాయ్ లు కలిశారు. రేపు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న శివసేన ఈ మేరకు చర్చించనుంది. అటు బీజేపీ మాత్రం ఎవరి నుంచి మద్దతు తీసుకోవాలనే విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతోంది.