: మోత్కుపల్లి, ఎర్రబెల్లి, కృష్ణయాదవ్, రమణల అరెస్ట్
టీడీపీ చేపట్టిన నల్గొండ జిల్లా బంద్ కార్యక్రమం కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారితీస్తోంది. హైదరాబాద్-విజయవాడ రహదారిపై ఉన్న చిట్యాల వద్ద టీటీడీపీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కృష్ణయాదవ్, ఎల్.రమణలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా హైదరాబాద్ నుంచి నల్గొండకు కార్లలో వెళుతుండగా పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. నల్గొండలో 144 సెక్షన్ అమల్లో ఉందని... అందుకే టీడీపీ నేతలను నల్గొండ వెళ్లేందుకు అనుమతించలేదని పోలీసులు తెలిపారు. వీరి అరెస్టుతో చిట్యాలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.