: ఏపీ ద్వారా తెలంగాణాకు దక్కే ఆదాయం 100 కోట్లు, టీఎస్ ద్వారా ఏపీకి 80 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై 2శాతం సెంట్రల్ సర్వీస్ టాక్స్ విధించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనికి సంబంధించిన జోవోను విడుదల చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైందని తెలుస్తోంది. ఈ జోవో విడుదల చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కు మధ్య ఉన్న ఎనిమిది చెక్ పోస్టుల వద్ద ఈ టాక్స్ ను వసూలు చేస్తారు. ఇప్పటికే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి అవుతున్న వస్తువుల మీద 2 శాతం సెంట్రల్ సర్వీస్ టాక్స్ ను వసూలు చేస్తోంది. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఏటా రూ. 100 కోట్లు సమకూరనుందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఈ సుంకం వసూలు ద్వారా ఆంధ్రప్రదేశ్ కు ఏటా 80 కోట్ల ఆదాయం సమకూరనుందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు హై క్వాలిటీ బియ్యం, కొబ్బరికాయలు, పురుగు మందులు, జీడిపప్పు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇసుక, ఎరువులు ఎగుమతి అవుతుండగా... తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు సిమెంట్, బీర్, పత్తి ఎగుమతి అవుతున్నాయి.