: ఆసీస్ టూర్ లో వీరేంద్ర సెహ్వాగ్ కు స్థానం?
ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న టెస్ట్ సిరీస్ లో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ సిరీస్ కోసం సెహ్వాగ్ ను మూడో ఓపెనర్ గా ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అయితే, సెహ్వాగ్ ఎంపిక త్వరలో జరగనున్న దేశవాళీ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ లో అతని పర్ఫామెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. దులీప్ ట్రోఫీ లో గనుక సెహ్వాగ్ తన బ్యాట్ ను ఝుళిపిస్తే... అతని ఎంపిక ఖాయమని బోర్డు వర్గాలు అంటున్నాయి. సెహ్వాగ్ ప్రస్తుత ఫామ్ ఎలా ఉందో తెలుసుకోవడానికే అతనిని నార్త్ జోన్ టీంలో ఎంపిక చేశారని బోర్డు ఉన్నతాధికారులు అంటున్నారు. వరుస బ్యాటింగ్ వైఫల్యాలతో జట్టులో స్థానం కోల్పోయిన వీరేంద్ర సెహ్వాగ్ ఆఖరిగా 2013 లో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.