: ఖరారైన చంద్రబాబు జపాన్ పర్యటన


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ పర్యటన ఖరారైంది. నవంబర్ 24 నుంచి 29 వరకు ఆరు రోజుల పాటు ఆయన జపాన్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో కోస్తాంధ్ర నగరాల అభివృద్ధికి సంబంధించి ఏపీ ప్రభుత్వం, జపాన్ ప్రభుత్వం మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నాయి. కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం, మచిలీపట్నం సహా పలు ప్రాంతాల అభివృద్ధిపై అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే, వైజాగ్ ను స్మార్ట్ సిటీ చేస్తామని అమెరికాలో ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, జపాన్ పర్యటనలో అక్కడి పోర్టులు, రహదారులు, వివిధ నగరాలను ముఖ్యమంత్రి సందర్శించనున్నారు.

  • Loading...

More Telugu News